డబ్ల్యూపీఎల్ వేలంలో దీప్తి శర్మను రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసిన యూపీ వారియర్స్

الخميس، 27 نوفمبر 2025

Amelia Kerr from Kiwis was bought by Mumbai Indians for Rs 3 crore cricket national sports UP Warriors buy Deepti Sharma for Rs 3.20 crore in WPL auction

t f B! P L


న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 మెగా వేలంలో టీమిండియా ఆల్‌రౌండర్ దీప్తి శర్మను యూపీ వారియర్స్ రూ.3.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేయగా, ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అయితే యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ కార్డ్‌ ఉపయోగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ దీప్తి శర్మ కోసం రూ.3.20 కోట్లతో బిడ్ వేసింది. ఆ ధరను చెల్లించేందుకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ ఆ జట్టు సొంతమైంది. గత సీజన్‌లో దీప్తి శర్మకు యూపీ వారియర్స్‌ రూ. 2.60 కోట్లు చెల్లించింది. కానీ మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసిన యూపీ వారియర్స్ చివరకు రూ.3.20 కోట్లకు ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఇదే తొలి ఆక్షన్ కాగా.. మల్లికా సాగర్ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీతో మెగా వేలం ప్రారంభం కాగా ఆమెను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆమె తొలి రౌండ్‌లో అన్‌సోల్డ్‌గా నిలిచింది. మరోసారి ఆమె పేరును వేలం వేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేయగా, కివీస్‌కే చెందిన అమెలియా కేర్‌ను ముంబై ఇండియన్స్ రూ.3 కోట్లకు తీసుకుంది. భారత పేసర్ రేణుకా సింగ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్‌ను రూ.85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా రిటైన్ చేసుకుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ