3-0తో ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ : 42 ఏళ్లలో ఇదే తొలిసారి

السبت، 1 نوفمبر 2025

cricket First time in 42 years Mitchell Santner has made history as the captain to achieve this feat New Zealand clean sweeps England 3-0 sports

t f B! P L


ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 42 ఏళ్లలో ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేయడం న్యూజిలాండ్‌కు ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్ చరిత్రకెక్కాడు. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 2 వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా న్యూజిలాండ్ ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 222 పరుగులు చేసింది. జెమీ ఓవర్టన్ (62 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా, జోస్ బట్లర్ (56 బంతుల్లో 7 ఫోర్లతో 38), బ్రైడన్ కార్స్ (30 బంతుల్లో ఫోర్, 4 సిక్స్‌లతో 36) విలువైన పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో బ్లయర్ టిక్‌నర్( 4/64) నాలుగు వికెట్లు తీయగా, జాకోబ్ డఫ్ఫీ (3/56) మూడు వికెట్లు పడగొట్టాడు. జాక్ ఫోల్కర్స్ రెండు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్‌ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం న్యూజిలాండ్ 44.4 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసి గెలుపొందింది. రచిన్ రవీంద్ర(37 బంతుల్లో 7 ఫోర్లతో 46), డారిల్ మిచెల్(68 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, సామ్ కరన్ రెండేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీసారు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన న్యూజిలాండ్ 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ చివరిసారిగా 1983లో జియోఫ్ హోవర్త్స్ సారథ్యంలో ఇంగ్లండ్ వైట్ వాష్ చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు మిచెల్ సాంట్నర్ సారథ్యంలో ఈ ఘనతను అందుకుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ