21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక !


భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 21న మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు రాష్ట్రపతి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30గంటలకు నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 3:25 గంటల వరకు రాజ్‌భవన్‌లో విశ్రాంతి తీసుకుంటారు. 3:50 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. సాయంత్రం 6:15 గంటలకు తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. 22వ తేదీ ఉదయం 9:30గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి పుట్టపర్తికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బయలుదేరనున్నారు.

Post a Comment

0 Comments