కెన్యాలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 21 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. దక్షిణ కెన్యా ప్రాంతంలోని మారాక్‌వెట్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడ్డాయని కెన్యా అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. ఈ ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని సదరు మంత్రి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ వర్షాకాలం కావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించారు.
0 Comments