Ad Code

మూడవ త్రైమాసికంలో 100 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆల్ఫాబెట్ !


గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ చరిత్రలోనే తొలిసారిగా 100 బిలియన్ డాలర్ల త్రైమాసిక ఆదాయాన్ని సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసింది. సెర్చ్, క్లౌడ్, యూట్యూబ్ వంటి కీలక విభాగాలలో బలమైన రెండంకెల వృద్ధిని సాధించడం వల్లనే ఇది సాధ్యమైందని ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.2025 మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలనుగూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్  ప్రకటించింది. ఈ సందర్భంగా ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ జెమినీ యాప్ కు నెలవారి యాక్టివ్ యూజర్లు 650 మిలియన్లు దాటారని, గత త్రైమాసికంతో పోలిస్తే ఏఐ జెమినీకి వచ్చే ప్రశ్నలు మూడు రెట్లు పెరిగాయని తెలిపారు. కంపెనీ వృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు. క్లౌడ్ విభాగం కూడా అద్భుతమైన పనితీరును కనబరిచిందని పేర్కొన్న ఆయన, దీనికి ఏఐ ఆధారిత ఆదాయం కీలకమంటూ వెల్లడించారు. క్లౌడ్ బ్యాక్ లాగ్ 46శాతం పెరిగి 150బిలియన్ డాలర్లకు చేరుకుందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్ వన్, యూట్యూబ్ ప్రీమియం వంటి సబ్స్క్రిప్షన్ లు కూడా 300 మిలియన్ల మార్కును అధిగమించాయని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40భాషలలో అందుబాటులో ఉన్న ఏఐ మోడ్ కు రోజువారి 75 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారని, ఇది సెర్చ్, ప్రశ్నల పెరుగుదలకు దోహదం చేస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ త్రైమాసికంలో గూగుల్ సర్వీసెస్ ఆదాయం 14 శాతం వృద్ధితో 87 బిలియన్ డాలర్లకు చేరిందని గూగుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ వెల్లడించారు. యూట్యూబ్ ప్రకటనల ఆదాయం 15% వృద్ధి చెందిందని, సెర్చ్ ఆదాయం 15% వృద్ధి చెందిందని పేర్కొన్నారు . ఏఐ ఓవర్ వ్యూస్, ఏఐ మోడ్ వంటి కొత్త ఫీచర్ల పైన పెట్టుబడులు ఆదాయాన్ని అర్థించడానికి కొత్త అవకాశాలను పెంచాయని ఆయన అన్నారు. ఈసారి రిటైల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలు గూగుల్ ఆదాయం పెరగడానికి ముఖ్య భూమిక పోషించాయని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu