కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో 20 మంది మృతి

الاثنين، 3 نوفمبر 2025

20 killed as gravel-laden tipper hits RTC bus Criem Hyderabad-Bijapur National Highway near Mirjaguda in Chevella mandal of Rangareddy district telangana

t f B! P L


హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపైని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్‌ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు 20 మంది మృతి చెందారు. అలాగే, 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగంతో వచ్చిన టిప్పర్‌ లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. లారీలో ఉన్న కంకర లోడు బస్సు ముందు భాగంలో పడిపోవడంతో, అందులో కూర్చున్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అలాగే, బస్సు డ్రైవర్ తో పాటు ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో  పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన మృతదేహాలను, గాయపడిన ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను వెంటనే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పది మందికి పైగా ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం కారణంగా చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు. టిప్పర్‌ లారీ అతివేగం మరియు అజాగ్రత్త వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ