బీహార్ లో నవంబర్ 19, 20 తేదీల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. పాట్నాలోని గాంధీ మైదానంలో ఇందుకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్‌ను బట్టి ఈ రెండు తేదీల్లోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనుందని సమాచారం. ఈ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ 202 సీట్లు గెలుపొంది అధికారాన్ని నిలబెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జాబితాను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ఎన్నికల సంఘం సమర్పించనుంది. అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన రానుంది. ఎన్నికల్లో విజయదుంధుబి మోగించిన నితీశ్ కుమార్ 17న క్యాబినెట్‌తో సమావేశం కానున్నారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్నారు. గెలుపొందిన ఎన్డీఏ అభ్యర్ధులు సమావేశమై తమ కూటమి నాయకుడిని ఎన్నుకుంటారు. అందరూ అమోదించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గత పదమూడు పర్యాయాలు బీహార్‌ను ఏలుతున్న నితీశ్ మరోసారి సీఎం కుర్చీలో కూర్చోవడం లాంఛనమే కానుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. అధికారంలోకి రావాలనుకున్న మహాఘట్‌బంధన్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు విడతల్లో 243 స్థానాలకు జరిగిన ఎలక్షన్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డేఏ 202 స్థానాల్లో గెలుపొందింది.
నవంబర్ 19, 20 తేదీల్లో బీహార్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
الأحد، 16 نوفمبر 2025
national New government to be sworn in in Bihar on November 19 and 20 Work related to this is going on at a fast pace at Gandhi Maidan in Patna
ليست هناك تعليقات:
إرسال تعليق