తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలను ప్రతీరోజు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ పాలను ప్రతిరోజు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోషకాహార లోపాన్ని అధిగమించి మన తెలంగాణ రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత తెలంగాణగా మార్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. అందులో భాగంగానే ఎక్కువగా వెనుకబాటుతనంతో ఉన్న మన ములుగు జిల్లాను ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అంగన్వాడీ టీచర్లు క్రియాశీల పాత్ర వహించాలని తెలిపారు. ముఖ్యంగా తల్లితండ్రులను కలిసి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను వివరించాలని సూచించారు. అలాగే కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా మన అంగన్వాడీ కేంద్రాలు పనిచేసేలా అంగన్వాడీలు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అనంతరం వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడుతూ తల్లితండ్రులను ఎవరైతే పిల్లలు నిర్లక్ష్యం చేస్తారో వారి నుండి ఆస్తులను జప్తుచేసి తల్లితండ్రుల మీద మార్పిడి చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కుల పరిరక్షణ, బాలి వివాహాలపై ఏర్పాటుచేసిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఆనం మాట్లాడుతూ.. బాల్యవివాహాలు పిల్లల అభివృద్ధికి విఘాతం అని, కానా బాల్య వివాహాలను అడ్డు ములుగును బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ విషయంలో CDPOలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు అలాగే ఇతరులు ఎంతో కృషిచేయాలని సూచించారు.
తెలంగాణలో అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ చిన్నారులకు ప్రతిరోజూ 100 మి.లీ పాలు !
الاثنين، 17 نوفمبر 2025
100 ml of milk daily for preschool children at Anganwadi center Minister Seethakka attended the program as the chief guest telangana
ليست هناك تعليقات:
إرسال تعليق