మహిళల ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్

السبت، 25 أكتوبر 2025

Australian spinner Alana King becomes the player with the best bowling figures cricket King bowled a total of 7 overs and took seven wickets for just 18 runs. sports Women's World Cup

t f B! P L


ఇండోర్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌-2025లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లు పడగొట్టింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా కింగ్ బౌలింగ్ ధాటికి 16.5 ఓవర్లలో కేవలం 97 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా 7 ఓవర్లు బౌలింగ్ చేసిన కింగ్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో కింగ్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రపంచ కప్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా కింగ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు జాకీ లార్డ్ పేరిట ఉండేది. 1982 ప్రపంచకప్‌లో లార్డ్‌ భారత్‌పై 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తాజా మ్యాచ్‌తో 33 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డును కింగ్‌ బ్రేక్‌ చేసింది. అదేవిధంగా మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంతవేగంగా ఫైవ్ వికెట్ హాల్‌ (బంతుల పరంగా) సాధించిన బౌలర్‌గా కింగ్ నిలిచింది. కింగ్ కేవలం 21 బంతుల్లోనే ఈ ఫీట్‌ను అందుకుంది. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ