తెలంగాణ లోని నాగర్‌కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప కుమారుడు మేకల జగపతి నిశ్చితార్ధం ఫంక్షన్ గోవాలో జరిగింది. ఈ కార్యక్రమానికి కటుుంబ సభ్యులు, బంధువులతోపాటు గ్రామస్తులను సైతం విమానంలో గోవా తీసుకెళ్లాలని మేకల అయ్యప్ప నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు విషయాన్ని కొడుకు జగపతికి తెలియజేశాడు. దీంతో తన తండ్రి కోరిక మేరకు తన గ్రామానికి చెందిన 500 మంది రైతు కుటుంబాలను, బంధువులను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల ద్వారా గోవాకు తరలించారు. శనివారం రెండు విమానాల్లో మేకల వారి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు మాత్రమే ఉండడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. తన తండ్రి కోరిక మేరకు వచ్చిన బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు ఈ సందర్భంగా జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కవ్య కృతజ్ఞతలు చెప్పారు. గ్రామస్తులందరికీ విమాన ప్రయాణం అవకాశం కల్పించాలనే తలంపుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయ్యప్ప, ఆయన కుమార్తె కావ్య పేర్కొన్నారు.
ホーム
/
telanganaAyyappa and his daughter Kavya said that this decision was taken with the idea of providing air travel to all the villagers
/
కొడుకు నిశ్చితార్థానికి విమానాల్లో 500 మంది బంధువులను గోవా తీసుకెళ్లిన తండ్రి !
الأحد، 26 أكتوبر 2025
Father takes 500 relatives to Goa for son's engagement telanganaAyyappa and his daughter Kavya said that this decision was taken with the idea of providing air travel to all the villagers
ليست هناك تعليقات:
إرسال تعليق