తమిళనాడులోని తెన్‌కాశీ జిల్లా పరిధిలోని మీనాక్షిపురం గ్రామంలో ఓ రైతు పొలంలోకి ఆహారం కోసం వెళ్లిన 40 నెమళ్లు మృత్యువాత పడ్డాయి. మీనాక్షిపురం గ్రామానికి చెందిన జాన్సన్ అనే రైతు తనకున్న ఎకరా పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అయితే పంట చేతికి వచ్చే సమయం కావడంతో పక్షులు, ఇతర జంతువుల బెడద ఎక్కువైంది. దీంతో రైతు జాన్సన్ తన పొలం చుట్టూ ఎలుకల మందును కలిపిన ఆహార పదార్థాలను చల్లి వెళ్లిపోయాడు. సాయంత్రం పదుల సంఖ్యలో అటుగా వచ్చిన నెమళ్లు రైతు జాన్సన్ చల్లిన విషపు గింజలను తిని కొద్ది సేపటికే కుప్పకూలిపోయాయి. అటుగా వెళ్తున్న ఓ పశువుల కాపరి.. జాన్సన్ పోలంలో పదుల సంఖ్యలో నెమళ్లు చనిపోవడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు అటవీశాఖ అధికారులతో కలిసి జాన్సన్ పొలం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఎలుకల మందు కలిపిన గింజలు తినడం వల్లే 40 పెద్ద నెమళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. నెమళ్ల కళేబరాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భారత జాతీయ పక్షి అయిన నెమళ్ల మృతికి కారణం అయిన రైతు జాన్సన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
పొలంలోకి ఆహారం కోసం వెళ్లి మృత్యువాతపడిన 40 నెమళ్లు : రైతు జాన్సన్ అరెస్టు
الأحد، 26 أكتوبر 2025
40 peacocks die after going into a field for food Farmer Johnson arrested Meenakshipuram village in Tenkasi district of Tamil Nadu
ليست هناك تعليقات:
إرسال تعليق