హెచ్‌-1బీ వీసా అభ్యర్థుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేసిన వాల్‌మార్ట్‌

الأربعاء، 22 أكتوبر 2025

america Bloomberg reported committed to providing the best service to customers and hiring talent science technology Walmart temporarily suspends hiring of H-1B visa candidates

t f B! P L


మెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్ హెచ్‌-1బీ వీసా అభ్యర్థుల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. హెచ్‌-1బీ వీసా నియామక విధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపినట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. అయితే, కస్టమర్లకు ఉత్తమ సేవ అందించేందుకు, ప్రతిభావంతులను నియమించడంలో కట్టుబడి ఉన్నట్లు పేర్కొంది. కాగా, ప్రస్తుతం వాల్‌మార్ట్‌లో 2,390 హెచ్‌-1బీ వీసా హోల్డర్లు పని చేస్తున్నారు. హెచ్‌1బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు(దాదాపు రూ. 88 లక్షలు) పెంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నెలరోజుల తర్వాత ఫీజును ఎలా చెల్లించాలో, ఈ ఫీజు నుంచి ఎవరికి మినహాయింపు లభిస్తుందో వివరాలు వెల్లడించింది. అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) సోమవారం ఫీజు పేమెంట్‌ పోర్టల్‌ను ప్రవేశపెడుతూ ఫీజు చెల్లించినట్లు రసీదు సమర్పించిన దరఖాస్తుదారులు మాత్రమే తదుపరి అడుగులు వేయాలని, అయితే కొందరు స్టూడెంట్‌ వీసాదారులకు మాత్రం ఫీజు రాయితీ ఉంటుందని తెలిపింది.ఎఫ్‌-1 వీసాలపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు, ఎల్‌-1 వీసాలపై ఉన్న ప్రొఫెషనల్స్‌తోసహా ప్రస్తుత వీసాదారులు హెచ్‌-1బీ హోదా కోసం దరఖాస్తు చేసినపుడు లక్ష డాలర్లను చెల్లించవలసిన అవసరం లేదని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. అమెరికా వెలుపల ఉన్న వ్యక్తులు దాఖలు చేసే దరఖాస్తులకు మాత్రం కొత్త ఫీజు వర్తిస్తుందనిగ్రీన్‌ అండ్‌ స్పీగెల్‌కు చెందిన డాన్‌ బెర్గెర్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. అమెరికాను వీడి ఉండి ప్రస్తుత హెచ్‌-1బీ వీసాపై దేశంలోకి తిరిగి ప్రవేశించడం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే వారికి కొత్త ఫీజు వర్తిస్తుందని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. హోదా మార్పు లేదా స్టే పొడిగింపునకు దరఖాస్తుదారు అర్హుడు కాదని తాము నిర్ధారిస్తే కంపెనీ యజమాని ఫీజును చెల్లించాల్సిన అవసరం ఉంటుందని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొంది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ డేటా ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం జూన్‌ నాటికి అమెజాన్‌ దాదాపు 10,044 హెచ్‌-1బీ వీసాలను ఉపయోగించింది. ఆ తర్వాత టీసీఎస్‌ 5,505, మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181), డెలాయిట్ (2,353), ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా అమెరికాస్ (951), ఒరాకిల్‌ (2,092), అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (2,347), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్ (2,493), వాల్‌మార్ట్‌ అసోసియేట్స్‌ (2,390) హెచ్‌-1బీ వీసాలను దక్కించుకున్నాయి. ఇవే కాకుండా అమెరికాకు చెందిన పలు కంపెనీలు కూడా హెచ్‌-1బీ వీసాలతో ఎక్కువమంది భారతీయులను నియమించుకుంటున్నాయి. వాటిపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ