దేశీయ మార్కెట్‌లో కవాసకి ప్రత్యేక స్థానం వుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్‌లు, అడ్వెంచర్ బైక్‌ల రంగంలో ఈ బ్రాండ్‌కి ఉన్న పేరు చెప్పక్కర్లేదు. నింజా, జడ్ సిరీస్ వంటి బైక్‌లు యువతలో విపరీతమైన క్రేజ్‌ను తెచ్చుకున్నాయి. అదే సమయంలో, క్లాసిక్ లుక్‌ని ఇష్టపడే వారికి డబ్ల్యూ సిరీస్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాసకి డబ్ల్యూ175 బైక్‌కి మార్కెట్‌లో మంచి ప్రారంభ స్పందన వచ్చినప్పటికీ, తాజాగా దాని అమ్మకాల గణాంకాలు కంపెనీకి నిరాశ కలిగించేలా మారాయి. కవాసకి ఇండియా తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ 2025 నెల విక్రయ నివేదిక ప్రకారం, డబ్ల్యూ175 బైక్ ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదు. ఇది గత సంవత్సరం ఇదే నెలలో అమ్ముడైన 106 యూనిట్లతో పోలిస్తే పెద్ద తగ్గుదలగా చెప్పుకోవాలి. ఈ గణాంకాలు చూసినప్పుడు స్పష్టమవుతుంది, డబ్ల్యూ175కు గతంలో ఉన్న డిమాండ్ క్రమంగా తగ్గిపోతోంది. దీనికి కారణాలు అనేకం కావచ్చు, బైక్ ధర మార్కెట్లో ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండటం, అలాగే కొత్త జనరేషన్ యువత ఇప్పుడు మరింత టెక్నాలజీ, ఫీచర్లను కోరుకుంటుండటం వల్లా కావచ్చు. మరోవైపు, దేశీయ బ్రాండ్‌లు తక్కువ ధరలో మైలేజ్, పనితీరును అందిస్తుండటంతో కవాసకి వంటి ప్రీమియం బ్రాండ్‌లకు సవాలు ఏర్పడుతోంది. మార్కెట్‌లో కొన్ని నెలల మాంద్యం ఉన్నప్పటికీ, ఈ బ్రాండ్‌కి ఉన్న గ్లోబల్ ఇమేజ్, నాణ్యత, అభిమానుల విశ్వాసం దీన్ని మళ్లీ పటిష్ట స్థితికి తీసుకురావడంలో సహాయపడతాయని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో కొత్త మోడళ్లు, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ బైక్‌ల రూపంలో కవాసకి తన దిశను మారుస్తే, మళ్లీ ఈ బ్రాండ్‌కి మార్కెట్లో బలమైన పునరాగమనం సాధ్యమే. కవాసకి డబ్ల్యూ175 భారత మార్కెట్‌లో రెట్రో లుక్స్‌తో కూడిన ప్రత్యేక బైక్‌గా గుర్తింపు పొందింది. క్లాసిక్ డిజైన్‌కి ఆధునిక ఇంజిన్ పనితీరును కలిపిన ఈ మోడల్, రోజువారీ ప్రయాణాలకు సరైన భాగస్వామిగా కవాసకి అందించింది. ప్రస్తుతం ఈ బైక్ భారతదేశంలో రెండు వేరియంట్లలో డబ్ల్యూ175 (బేస్ మోడల్), డబ్ల్యూ175 స్ట్రీట్‌లలో లభిస్తుంది. బేస్ మోడల్ డబ్ల్యూ175 లో క్లాసిక్ స్పోక్డ్ రిమ్స్, రౌండ్ హెడ్ల్యాంప్, సింపుల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. దీని రూపం పూర్తిగా పాత తరహా రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌లను గుర్తు చేస్తుంది. కలర్ ఆప్షన్‌ను బట్టి దీని ధరల్లో కొంత తేడా ఉంటుంది, నలుపు- బూడిద రంగు వేరియంట్‌లకు ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.15 లక్షల నుండి రూ. 1.25 లక్షల వరకు ఉంటుంది. ఇక రెండవ వేరియంట్ W175 స్ట్రీట్ కొంచెం ఆధునిక టచ్‌తో వస్తుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ వంటి కొన్ని కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. ఇది నగర రైడింగ్‌కి మరింత అనుకూలంగా ఉండేలా కవాసకి ఈ వెర్షన్‌ను రూపొందించింది. బైక్‌లో 177 సిసి సామర్థ్యమున్న రెండు వాల్వ్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్ SOHC ఇంజిన్ ఉపయోగించారు. ఈ ఇంజిన్ 12.8 bhp శక్తిని, 13.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన ఈ పవర్‌ట్రెయిన్ రోజువారీ ప్రయాణాలకు సరిపడే స్మూత్ పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది.
సెప్టెంబర్ నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోని కవాసకి డబ్ల్యూ175 బైక్ !
الجمعة، 31 أكتوبر 2025
automobile Kawasaki W175 bike not sold a single unit in the month of September science technology This is a big drop compared to the 106 units sold in the same month last year.
ليست هناك تعليقات:
إرسال تعليق