దుబాయ్‌లో జరిగిన ఒక మోటార్ ఈవెంట్‌లో బంగారు హయాబుసా కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సుజుకి హయబుసా ధర కొంత ఎక్కువగానే ఉంది. అలాంటి ఈ బైకును బంగారంతో తయారు చేస్తే దాని ధర ఇంకెంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైకును చూసిన వారంతా ధర కొంత ఎక్కువగానే ఉందని భావించినా కానీ అసలు ధర తెలిశాక ఫుల్ షాక్ అవుతున్నారు. దీని ధర అక్షరాలా రూ.1.67 కోట్లు అని సమాచారం. ఈ బైకులో చాలా వరకు గోల్డ్ బాడీవర్క్‌ఉండగా, వజ్రాలను కూడా ఉపయోగించారు. కాగా బోల్టులు కూడా బంగారమే కావడం గమనార్హం. అయితే ఈ బైకుకు వేసిన గోల్డ్ లీఫ్ పెయింట్ కోసం మాత్రమే ఏకంగా రూ. 13.3 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ పెయింట్ వర్క్ మొత్తాన్ని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ కళాకారులలో ఒకరైన మిస్టర్ డానీ పూర్తిచేశారని చెబుతున్నారు. 400 హార్స్‌పవర్ ఇంజిన్‌తో ఉన్న ఈ బైక్ ఆటోమొబైల్ ఔత్సాహికులను తెగ ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా దీని వెనుక టైరు.. పరిమాణంలో బుగట్టి కారు కంటే పెద్దదిగా ఉన్నట్టు కనబడుతోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోకు పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
రూ.1.67 కోట్ల విలువైన బంగారు హయాబుసా : పెయింట్స్‌కే రూ.13.3 లక్షలు !
السبت، 25 أكتوبر 2025
automobile Gold Hayabusa worth Rs. 1.67 crores: Paints cost Rs. 13.3 lakhs technology There is no need to say how much more it would cost if such a bike was made of gold
ليست هناك تعليقات:
إرسال تعليق