తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని ప్రజలను మోసం చేసే ప్రభుత్వమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు మాటల ప్రభుత్వం, కోతల ప్రభుత్వమని, రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు ఎందరు ప్రభుత్వం దగ్గర డేటా ఉందని, దద్దమ్మ ప్రభుత్వం… రైతుల నుండి దరఖాస్తులు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఫసల్ భీమా ఊసే లేదు.. రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టీ… రైతులకు సంకెళ్లు వేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, అప్పుడు బీఆర్‌ఎస్ రైతులకు సంకెళ్లు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వేస్తుంది సంకెళ్ళ్ళు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అండగా ఉందని, నవంబర్ 30 న నాలుగో విడత రుణమాఫీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. ఆ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్ లలో చేరలేదని, ఇంకా నాలుగు సంవత్సరాలు అయినా రుణమాఫీ కాదని ఆయన సెటైర్లు వేశారు. కనీస మద్దతు ధర కొన్ని పంటల మీద 80 శాతం మోడీ ప్రభుత్వం పెంచిందని, కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా ధాన్యం కొనుగోలు లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇది నేరపూరిత చర్య అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రైవేట్ రైస్ మిల్లర్ లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు అన్యాయం చేస్తుందని, రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ ప్రభుత్వానికి అధికారుల మీద అజమాయిషీ లేదా అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని ప్రజలను మోసం చేసే ప్రభుత్వం !
الجمعة، 3 يناير 2025
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాదని ప్రజలను మోసం చేసే ప్రభుత్వం రైతు భరోసా లో కోతలు పెట్టే కుట్రలు రైతుల నుండి దరఖాస్తులు ఎందుకు
ليست هناك تعليقات:
إرسال تعليق