ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం అనారోగ్యంతో ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా ట్వీట్ చేశారు. భారతదేశం రెండు అణు పరీక్షలు నిర్వహించిందని, ఆ సమయంలో శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన మృతిపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. రాజగోపాలం చిదంబరం కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1975, 1998లో దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలక పాత్ర వహించారని గుర్తు చేశారు. భారతదేశ అణుశక్తి విభాగానికి చిదంబరం నాయకత్వం వహించారని ఈ సందర్బంగా ఆయన దేశానికి అందించిన సేవలను చంద్రబాబు కొనియాడారు.
అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
السبت، 4 يناير 2025
1975 1998లో దేశం నిర్వహించిన రెండు అణు పరీక్షల్లో కీలక పాత్ర national science technology అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
ليست هناك تعليقات:
إرسال تعليق