నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు పదోతరగతి విద్యార్థినులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపగా చివరికి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక రోజులోనే పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫ్రీ బస్సు మోజులో ముగ్గురు పదో తరగతి విద్యార్థినిలు పాఠశాలకు అని చెప్పి ఇంటి నుండి బయలుదేరి గురువారం ఉదయం నిజామాబాద్ బస్సు ఎక్కి వెళ్లగా ఒక విద్యార్థిని నిజామాబాద్ బస్టాండ్ లో శుక్రవారం ఉదయం 3 గంటలకే లభ్యం కాక, ఆ సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టగా జగిత్యాల, వేములవాడ, కరీంనగర్ ప్రాంతాలలో ఫ్రీ బస్సు ఉండడంతో తిరిగేందుకు వెళ్లారని తెలుస్తోంది. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ కార్యాలయంలో ముగ్గురు పిల్లలతో విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు 24 గంటల్లోనే ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ కనిపెట్టడం, ముగ్గురు బాలికలు సురక్షితంగా లభ్యం కావడంతో బాలికల కుటుంబ సభ్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం !
الجمعة، 3 يناير 2025
telangana కరీంనగర్ ప్రాంతాలలో ఫ్రీ బస్సు ఉండడంతో తిరిగేందుకు వెళ్లారని జగిత్యాల నిజామాబాద్ జిల్లాలో అదృశ్యమైన విద్యార్థినుల ఆచూకీ లభ్యం ఫ్రీ బస్సు మోజులో వేములవాడ సీసీ కెమెరాలు ఆధారంగా గాలింపు
ليست هناك تعليقات:
إرسال تعليق