చెద పురుగులను పొగాకు సహాయంలో పూర్తిగా ఇంట్లో లేకుండా చేయొచ్చు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అవుతోంది. పొగాకు ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని జిప్ లాక్ ఉన్న బ్యాగుల్లో నింపండి. వీటికి చిన్న చిన్న రంధ్రాలను కూడా చేయండి. దీంతో పొగాకు వాసన బయటకు వస్తుంటుంది. పొగాకు వాసనను చెదపురుగులు తట్టుకోలేవు. దీంతో ఈ వాసన చూసిన వెంటనే చెదలు చనిపోతాయి. ఇంట్లో చెదలు లేకుండా చేయడానికి జిప్ లాక్ బ్యాగుల్లో పొగాకును నింపి వాటిని ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. అంటే మీ ఇంట్లో చెదలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ పెట్టండి. అయితే ఈ బ్యాగులను మీరు నెలకోసారి మార్చాల్సి ఉంటుంది. పొగాకుతోనే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ఇంట్లో చెదలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం వెల్లుల్లి, వేప ఆకుల ద్రావనం బాగా సహాయపడుతుంది. దీన్ని చెదలు ఉన్న చోట స్ప్రే చేయాలి. వరుసగా కొన్ని రోజుల పాటు ఫర్నిచర్ నుంచి గోడల వరకు ప్రతిచోటా స్ప్రే చేస్తూ ఉంటే చెద పురుగుల నుంచి విముక్తి పొందుతారు.
ホーム
/
వేప ఆకుల ద్రావనం
/
పొగాకు - చెద పురుగులు !
الجمعة، 3 يناير 2025
chitka పొగాకు - చెద పురుగులు పొగాకు ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలు వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ వెల్లుల్లి వేప ఆకుల ద్రావనం
ليست هناك تعليقات:
إرسال تعليق