తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో విచారణ జరిపిన రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ అసిస్టెంట్ గీతారాణి, ఎస్జీటీలు విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం. ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె. ఉమాదేవి, నర్సింహారావు, శైలజ, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమారి 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ఐదు దఫాలుగా వీరికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. గైర్హాజరుపై సదరు ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీర్ఘకాలికంగా గైరాజరైన 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో సత్యనారాయణ తెలిపారు.
0 Comments