భారత సంతతికి చెందిన ఓపెన్‌ ఏఐ ప్రజా వేగు సుచిర్‌ బాలాజీ (26) అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించారు. నవంబర్‌ 26న అతడు మరణించగా, ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాథమిక విచారణ అనంతరం ఇది ఆత్మహత్య అని పోలీసులు భావిస్తున్నారు. ''ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి అనుమానాస్పద ఆధారాలు లభ్యం కాలేదు'' అని తెలిపారు. ఓపెన్‌ ఏఐ ఆపరేషన్లు, అనుసరిస్తున్న విధానాలు ఆందోళనకరంగా ఉన్నట్లు గతంలో తన రీసెర్చ్‌ ద్వారా బాలాజీ వెల్లడించారు. ఆ కంపెనీ పలు కాపీరైట్ల ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఆ ఆరోపణలు చేసిన మూడు నెలల తర్వాత బాలాజీ మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. అతడి లింక్డిన్‌ ప్రొఫైల్ ప్రకారం 2020 నవంబర్‌ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు ఓపెన్‌ ఏఐలో విధులు నిర్వర్తించాడు. గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌తో ఈ యువ టెకీ మాట్లాడుతూ.. సమాజానికి మేలుకంటే హాని చేసే టెక్నాలజీల కోసం ఇక ఏమాత్రం పనిచేయాలని తాను కోరుకోవడం లేదని, అందుకే ఆ సంస్థను వీడానని వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ