తప్పుడు పుకార్లు రాసినా, చెప్పినా, మౌనంగా ఉండబోను : సాయి పల్లవి !


సినీ నటి సాయి పల్లవి రామాయణ సినిమా కోసం తన చాలా అలవాట్లను మార్చుకుందని, ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తునందుకు ఆమె నాన్ వెజ్ మానేసిందని, పూర్తిగా వెజ్ మాత్రమే తింటుందని అంతేకాదు ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన చెఫ్‌ల బృందాన్ని తనతో తీసుకువెళుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.  తాజాగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చింది ' చాలా సార్లు, దాదాపు ప్రతిసారీ, నేను నిరాధారమైన పుకార్లు, కల్పిత అబద్ధాలు/ తప్పుడు ప్రకటనలు ఉద్దేశ్యంతో లేకుండా వ్యాప్తి చెందడాన్ని చూసినప్పుడల్లా మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు అస్సలు అలా ఊరుకోను. ఏదైనా పేరున్న మీడియా లేదా పేజీ నాపై తప్పుడు పుకార్లు రాసినా, చెప్పినా, మౌనంగా ఉండబోనని, ఒకవేళ అలా జరిగితే కచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటానని సాయి పల్లవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో సాయి పల్లవి చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Post a Comment

0 Comments