Ad Code

నకిలీ జీడిపప్పును కనిపెట్టడం ఎలా ?


జీడిపప్పులో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, జింక్ మరియు రాగి వంటి అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా వుంటాయి. అయితే కల్తీ జీడిపప్పు ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది.నకిలీ జీడిపప్పును కనిపెట్టడం ఎలానో చూద్దాం.  మార్కెట్‌లో జీడిపప్పు కొనడానికి వెళ్లినప్పుడల్లా, ముందుగా వాటి రంగును తనిఖీ చేయండి. జీడిపప్పు రంగు లేత పసుపు రంగులో ఉంటే, అది నకిలీ కావచ్చు. నిజమైన జీడిపప్పు రంగు తెలుపు. అలాగే మచ్చలు, నలుపు, రంధ్రాలు ఉన్న జీడిపప్పును కొనకూడదు. నిజమైన జీడిపప్పు ఒక అంగుళం పొడవు మరియు కొద్దిగా మందంగా ఉంటుంది. అయితే, దీని కంటే పెద్దగా, మందంగా ఉండే జీడిపప్పు నకిలీ కావచ్చు. ఒక గిన్నెలో శుభ్రమైన నీటితో నింపాలి.  4-6 జీడిపప్పులు దానిలో వేయండి. జీడిపప్పు నీటిలో మునిగితే, ఆ జీడిపప్పు నిజమేనని అర్థం చేసుకోండి. జీడిపప్పు నీటిలో తేలితే జీడిపప్పులో కల్తీ జరిగే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. నిజమైన జీడిపప్పు కొద్దిగా తీపిగా ఉంటుంది, నకిలీ జీడిపప్పులు చప్పగా ఉంటాయి. అంతేకాకుండా, నిజమైన జీడిపప్పు నమలినప్పుడు సులభంగా విరిగిపోతుంది. నకిలీ జీడిపప్పును నమిలేటప్పుడు జిగట అనుభూతి వస్తుంది. నకిలీ జీడిపప్పు కంటే నిజమైన జీడిపప్పు బరువు కొంచెం ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పు నిజమో, నకిలీదో వాసన చూసి తెలుసుకోవచ్చు. నిజమైన జీడిపప్పు తేలికపాటి సువాసనను కలిగి ఉంటుంది. అయితే, అవి జీడిపప్పు నూనె వంటి వాసన ఉంటే, అవి నకిలీ కావచ్చు. నాణ్యత లేని జీడిపప్పు లేదా నకిలీ జీడిపప్పు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. జీడిపప్పును కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతను గుర్తించడం చాలా ముఖ్యం.

Post a Comment

0 Comments

Close Menu