చైనా 'మాగ్లెవ్ రైలు' డెమో రన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించింది. తొలి పరీక్షలో గంటలకు ఏకంగా 622 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ రైలు సంప్రదాయ ట్రాక్ ల మీద కాకుండా హైపర్ లూప్ లో ప్రయాణిస్తుంది. మాగ్నటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో రూపొందిస్తున్న ఈ రైలు గాల్లోనే తేలుతూ ముందుకుసాగుతుంది. ప్రయాణీకులకు ఈ రైలు ధ్వని వేగం కంటే ఎక్కువ స్పీడ్ తో తీసుకెళ్లనుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే నిమిషాల వ్యవధిలో వందల కిలో మీటర్లు చేరుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతైన ప్రజా రవాణ వ్యవస్థ అయిన హైపర్ లూప్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఎలన్ మస్క్ భావించారు. ఆ దిశగా పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ, ఆయన కంటే ముందుగానే చైనా తన కొత్త అల్ట్రా-హై-స్పీడ్ డెమో రన్‌ ను విజయవంతంగా నిర్వహించింది. దీంతో మస్క్ కలలు చెదిరిపోయాయి. మాగ్లెవ్ రవాణా వ్యవస్థ ద్వారా ప్రయాణీకులను గంటకు 1,000 కి.మీ వేగంతో గమ్య స్థానాలకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మస్క్ ఊహించిన దాని కంటే చాలా ఎక్కువ స్పీడ్ తో ప్రయాణించే 'మాగ్లెవ్ రైలు' చైనా రూపొందించడం విశేషం. చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌ లో లో వాక్యూమ్ వెదర్ లో 2 కి. మీ పొడవు ఏర్పాటు చేసిన హైపర్ టూప్ (పైప్‌ లైన్‌)లో 'మాగ్లెవ్ రైలు'కు సంబంధించి తొలి టెస్ట్ రన్ నిర్వహించారు. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్, షాంగ్సీ సంయుక్తంగా నిర్మించిన ఈ పరీక్షలు నిర్వహించారు. లో వాక్యూమ్ ట్యూబ్ మాగ్నెటిక్ లెవిటేషన్ ట్రాన్స్‌ పోర్టేషన్ సిస్టమ్ ద్వారా 'మాగ్లెవ్ రైలు' విజయంతంగా ట్రయల్ రన్‌ పూర్తి చేసింది. అన్ని వ్యవస్థలను అనుకున్నట్లుగా పని చేసినట్లు అధికారులు తెలిపారు. చైనాకు చెందిన మాగ్లెవ్ రైలు గంటకు 2000 కి.మీ కంటే ఎక్కువ వేగాన్ని అందుకునే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. 'మాగ్లెవ్ రైలు' మాగ్నెటిక్ లెవిటేషన్‌ టెక్నాలజీతో రూపొందుతుంది. రైలులోని సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలు రైలును లెవిటేట్, రైజ్ చేయడానికి పైవైపు ఉన్న మెటల్‌ తో ఇంటరాక్ట్ అవుతాయి. ఇవి ట్రాక్ పైన ఉన్న పాడ్‌లను పైకి లేపుతాయి. అంటే సంప్రదాయ ట్రాక్ అవసరం లేదు. చక్రాలు ఉండవు. ట్రాక్‌ తో సంబంధం లేకుండా మాగ్నటిక్ అనేది రైలును ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. 'మాగ్లెవ్ రైలు' ఇటీవల రికార్డు స్థాయిలో 387mph (622 kmph) వేగాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు(361mph) జపాన్ ఉంది. దీని రికార్డును 'మాగ్లెవ్ రైలు' బ్రేక్ చేసింది. అంతేకాదు, చైనా ఇంజనీర్లు మాగ్లెవ్ సిస్టమ్ ద్వారా రైలు 1,243mph(2000 kmph) కంటే ఎక్కువ హైపర్‌ సోనిక్ వేగాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. ఇది ధ్వని వేగం కంటే ఎక్కువ వేగం.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ