సినీ నటుడు మోహన్‌బాబు ఫాంహౌస్ వద్ద మంచి మనోజ్ బౌన్సర్లు మరో వైపు విష్ణు బౌన్సర్లు మధ్య గొడవ జరిగింది. మనోజ్‌ను విష్ణు బౌన్సర్లు బయటకు పంపిస్తున్నారు. మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. విష్ణు బయటకు వచ్చి బౌన్సర్లును బయటకు తోసేశారు. మోహన్‌బాబు ఫామ్‌హౌస్‌కు పహడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మంచు మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. తండ్రి మోహన్‌బాబు తనపై చేసిన ఫిర్యాదుపై మంచు మనోజ్  స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నింటిని విజయ రెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తనతో పాటు భార్య మౌనికపై అసత్య ఆరోపణ చేస్తున్నారని ఫిర్యాదు చేశానన్నారు. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరానన్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశ పడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని చెప్పారు. ఈ వివాదాల్లో తన కూతుర్ని తీసుకు రావడం చాలా బాధాకరమని అన్నారు. గత కొన్నాళ్లగా ఆ ఇంటి నుంచి తన కుటుంబంతో దూరంగానే ఉంటున్నామని, తన ముందే తన కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులను తీవ్రంగా తిట్టారని, ఇంటిలో ఉండాల్సిన సిసి ఫుటేజీ కెమెరాలు మాయమయ్యాయని, అన్న విష్ణు దుబాయ్‌కు ఎందుకు వెళ్ళాడో అందరికీ తెలుసునని అన్నారు. విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని, ఇంటిలో ఉన్న సీసీ కెమెరాలు అన్నిటిని విజయరెడ్డి , కిరణ్ రెడ్డి తీసుకొని వెళ్ళిపోయారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడ లేదని..ఆస్తుల కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని అన్నారు. తాను, తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదించుకుంటున్నామని చెప్పారు. విద్యాసంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని.. బాధితుల పక్షాన నిలబడినందుకు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ వ్యాఖ్యానించారు. మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌  ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లడంతో వివాదం మరింత ముదిరింది. ఆస్తుల పంపకాల విషయంలో మోహన్‌బాబుకు, ఆయన చిన్న కొడుకు మనోజ్‌కు మధ్య గొడవ జరిగినట్లు, ఇద్దరూ కొట్టుకున్నట్లు ఆదివారం మీడియా వర్గాల్లో వార్తలు హల్‌చల్‌ చేశాయి. అదంతా నిజం కాదని, అబద్దపు వార్తలు ప్రచారం చేయొద్దని మోహన్‌బాబు ట్విటర్‌లో ప్రకటించిన కొన్ని గంటలకే బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఎంఎల్‌సీ (మెడికల్‌ లీగల్‌ సర్టిఫికెట్‌) చేయించిన మనోజ్‌ ఆ మెడికల్‌ రిపోర్టులతో సహా.. వెళ్లి పహాడీషరీఫ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఆదివారం పది మంది గుర్తుతెలియని వ్యక్తులు తమ ఇంటికి (జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం) వచ్చి గట్టిగా అరుస్తూ భయబ్రాంతులకు గురిచేశారని, వారిని అడ్డుకునే సమయంలో తన దాడి చేశారనీ, ఇంటి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలు ఎత్తుకెళ్లారని, దుండగులను పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించాలని మనోజ్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, ఆయన భార్య మౌనిక, వారి అనుచరుల ద్వారా తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ సీపీకి మోహన్‌బాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీపీకి రాసిన లేఖను మోహన్‌బాబు మీడియాకు విడుదల చేశారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులతో కలిసి తన ఇంటిని, ఆస్తులను లాక్కోవాలని చూస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. తన కొడుకు మనోజ్‌, కోడలు మౌనిక ప్లాన్‌ ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు నమ్ముతున్నానని వెల్లడించారు. తను 78 ఏళ్ల సీనియర్‌ సిటిజన్‌ననీ, తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థిస్తున్నట్లు సీపీకి రాసిన లేఖలో మోహన్‌బాబు పేర్కొన్నారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ