తెలంగాణలోని ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. తెలంగాణ గ్రేహౌండ్స్, యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ జరిపాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి బద్రు అలియాస్ పాపన్నతో పాటు అతని దళ సభ్యులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో కురుసం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, ఎలగోపు మలయ్య అలియాస్ మధు, ముస్సకి అలియాస్ కరుణాకర్, ముస్సకి జమున, జైసింగ్, కిషోర్, కామేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఏటూరు నాగారంలో భారీ ఎన్‌కౌంటర్ !
الأحد، 1 ديسمبر 2024
telangana ఏటూరు నాగారంలో భారీ ఎన్‌కౌంటర్ ఏడుగురు మావోయిస్టులు మృతి తెలంగాణ గ్రేహౌండ్స్ భారీగా ఆయుధాలు స్వాధీనం యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్త ఆపరేషన్
ليست هناك تعليقات:
إرسال تعليق