ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ వేర్‌హౌస్ గోదాముల్లో నిబంధనలకు విరుద్ధంగా సార్టెక్ మిషన్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సీఎంతో జరిగిన భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గోదాముల్లోనే బియ్యం రీసైక్లింగ్ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఈ మిషన్లను ఎప్పుడు, ఎవరు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించగా, వారి నుంచి సరైన సమాధానం రాలేదు. అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి గోదాములను లీజుకు తీసుకున్నదెవరో తేల్చాలని ఆదేశించారు.
వేర్‌హౌస్ గోదాములను లీజుకు తీసుకున్నదెవరో తేల్చండి !
الاثنين، 2 ديسمبر 2024
Andhra Pradesh మంత్రి నాదెండ్ల ఆదేశం వేర్‌హౌస్ గోదాములను లీజుకు తీసుకున్నదెవరో తేల్చండి
ليست هناك تعليقات:
إرسال تعليق