పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణ దేవాలయం గేటు వద్ద ఇవాళ ఉదయం సేవలో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దుండగులు కాల్పులు జరిపారు. సిక్కు మత పెద్దలు వేసిన శిక్షలో భాగంగా సుఖ్‌బీర్ సింగ్ స్వర్ణదేవాలయం గేటు వద్ద డ్యూటీ నిర్వహిస్తున్నారు. మెడలో ఫలక, చేతిలో బల్లెముతో మంగళవారం కూడా సుఖ్‌బీర్ సింగ్ విధులు చేపట్టారు. కాల్పులు జరపబోయిన షూటర్‌ను పట్టుకున్నారు. బాదల్‌తో పాటు గేటు వద్ద ఉన్న శిరోమణి నేతలు ఆ షూటర్‌ను అడ్డుకున్నారు. కొన్ని బుల్లెట్లు ఫైర్ అయ్యాయి. అయితే అదృష్టవశాత్తు సుఖ్‌బీర్‌కు ఏమీ కాలేదు. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి సుఖ్‌బీర్ దగ్గరకు రాగానే ప్యాంటులో నుంచి రివాల్వర్ తీసి ఫైర్ చేశాడు. ఈ ఘటనకు చెందిన వీడియో రిలీజ్ చేశారు.
సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు !
الأربعاء، 4 ديسمبر 2024
Criem national punjab అదృష్టవశాత్తు సుఖ్‌బీర్‌కు ఏమీ కాలేదు మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు స్వర్ణ దేవాలయం గేటు వద్ద
ليست هناك تعليقات:
إرسال تعليق