తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ దోపిడికి పాల్పడిన ముఠాలోని ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ శుక్రవారం వరంగల్‌లో వెల్లడించారు. వారి వద్ద నుంచి కోటి ఎనభై లక్షల రూపాయల విలువచేసే 2 కిలోల 520 గ్రాముల బంగారం, కారుతోపాటు రూ. 10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముఠాలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారన్నారు. వారిలో నలుగురు పరారీలో ఉన్నారని చెప్పారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, మిగిలిన సొమ్మును సైతం వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకుంటామని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. ఈ ముఠా సభ్యుల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన వారని వివరించారు. నవంబర్ 18వ తేదీన రాయపర్తి ఎస్‌బీఐలో భారీ జరిగింది. బ్యాంకులో ఇనుప కిటికీలను గ్యాస్ కట్టర్‌తో తొలగించి దొంగలు లోపలికి ప్రవేశించారు. ఆ క్రమంలో బ్యాంక్‌లోని అలారం మోగకుండా ముందుగానే వైర్లు కట్ చేశారు. అలాగే సీసీ కెమెరాలు సైతం పగలకొట్టారు. ఫుటేజీని దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాంకులోని వివిధ లాకర్లలో ఉంచి రూ.13 కోట్ల విలువైన 19 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. అయితే అక్టోబర్ మాసంలో ఇదే తరహా చోరీ కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఆ ముఠా పనేనంటూ పోలీసులు సందేహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు ఐదు వందల మంది ఖాతాదారులకు చెందిన బంగారం చోరీకి గురు కావడంతో.. వారంతా తీవ్ర ఆందోళన చెందారు. మరోవైపు పోలీసులు ఈ చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
రాయపర్తి ఎస్‌బీఐ కేసులో ముగ్గురు అరెస్టు : రెండున్నర కిలోల బంగారం స్వాధీనం !
الجمعة، 6 ديسمبر 2024
Criem telangana నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ రాయపర్తి ఎస్‌బీఐ కేసులో ముగ్గురు అరెస్టు రెండున్నర కిలోల బంగారం స్వాధీనం వరంగల్ రూరల్ జిల్లా
ليست هناك تعليقات:
إرسال تعليق