ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో రేపు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్న సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా పలువురు వీఐపీలు హాజరుకానున్న నేపథ్యంలో ఎయిమ్స్‌ను సందర్శించి తీసుకోవలసిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.. అక్కడి నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ కు చేరుకోనున్న రాష్ట్రపతి, మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంబీబీఎస్ తొలి (2018) బ్యాచ్ విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఏపీ మంత్రి నారా లోకేష్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. మొత్తం 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, నలుగురు పోస్ట్ డాక్టోరల్ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేస్తారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ అధికారులు, ఎయిమ్స్ మంగళగిరి ఇన్స్టిట్యూట్ బాడీ సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, పట్టభద్రుల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని, తగురీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు.
మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
الاثنين، 16 ديسمبر 2024
Andhra Pradesh మంగళగిరి ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
ليست هناك تعليقات:
إرسال تعليق