భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో శనివారం మధ్యాహ్నం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన పార్థివదేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు. మన్మోహన్ సింగ్‌కు అంత్య క్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్రమోడీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. దేశానికి రెండు సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్‌కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయమై శుక్రవారం ఉదయం ప్రధాని మోడీతో ఖర్గే ఫోన్‌లో మాట్లాడారు. ఈ అంశంపై మోడీకి ఖర్గే రెండు పేజీల లేఖ కూడా రాశారు. ఈ సందర్భంగా రాజ నీతిజ్ఞులు, మాజీ ప్రధానులకు అంత్య క్రియలు జరిగిన స్థలంలోనే వారి స్మారకాలు నిర్మించిన సంప్రదాయం ఉందని ఖర్గే గుర్తు చేశారు. దేశ ప్రజల హృదయాల్లో మన్మోహన్ సింగ్ అత్యంత గౌరవనీయ స్థానం కలిగి ఉన్నారని, ఆయన సేవలు, సాధించిన విజయాలు అపూర్వం అని కొనియాడారు.
ముగిసిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలు
السبت، 28 ديسمبر 2024
national ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్‌లో త్రివిధ దళాధిపతులు ముగిసిన మన్మోహన్సింగ్ అంత్యక్రియలు విదేశీ ప్రతినిధులు సహా పలువురు నేతలు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
ليست هناك تعليقات:
إرسال تعليق