ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి రుణసాయం ఒప్పందానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు (ఏడీబీ) ఆమోద ముద్రవేసింది. మనీలాలో జరిగిన సమావేశంలో ఈమేరకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. రాజధాని నిర్మాణం కోసం ఏడీబీ నుంచి రూ.8 వేల కోట్ల రుణం అందనుంది. ఇటీవల ఢిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు, కేంద్ర ఆర్థికశాఖ, సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) అధికారుల మధ్య కీలక చర్చలు జరిగాయి. వచ్చే నెల 19న ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశం జరగనుంది. వాటిలో ఆ ఒప్పందంపై బ్యాంకు ప్రతినిధులు సంతకాలు చేయడంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరు ఆఖరులోగా సుమారు 25 శాతం నిధులు విడుదలవుతాయి. ఐదేళ్లు మారటోరియం: రూ. 15,000 కోట్లలో ప్రపంచబ్యాంకు, ఏడీబీ కలిసి రూ. 13,500 కోట్లను రుణంగా ఇస్తున్నాయి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చనుంది. రూ. 13,500 కోట్ల రుణాన్ని ఐదేళ్లపాటు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఐదేళ్ల తర్వాత చెల్లింపు మొదలవుతుంది. ఆరు నెలలకు ఒక వాయిదా చొప్పున 23 సంవత్సరాలపాటు రుణం చెల్లించే వెసులుబాటు ఉంది. ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుందని అధికార వర్గాల సమాచారం.
అమరావతి నిధుల మంజూరుకు ఏడీబీ ఆమోదం ?
الخميس، 12 ديسمبر 2024
Andhra Pradesh అమరావతి నిధుల మంజూరుకు ఏడీబీ ఆమోదం ? ఏడీబీ నుంచి రూ.8 వేల కోట్ల రుణం వచ్చే నెల 19న ప్రపంచబ్యాంకు బోర్డు సమావేశం
ليست هناك تعليقات:
إرسال تعليق