ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో అంగలూరికి చెందిన కొమ్మాలపాటి సాయి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. సాయి హైదరాబాద్ లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటికి వచ్చి స్నేహితులతో క్రికెట్ మ్యాచ్‌కు వెళ్లాడు. బౌలింగ్ చేస్తూ కుప్పకూలిపోయాడు. వెంటనే గుడివాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

Post a Comment

أحدث أقدم