ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండబోవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో టాలీవుడ్ ప్రముఖులతో ఈరోజు ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అసెంబ్లీలో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్‌గా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్‌లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండలన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలన్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని పేర్కొన్నారు. ఇక నుంచి బౌన్సర్లపై సీరియస్ ఉంటామని.. అభిమానులను కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

Post a Comment

أحدث أقدم