విద్యుతాఘాతానికి గురై గృహిణి మృతి


తెలంగాణలోని కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమరబండ గ్రామంలో విద్యుతాఘాతానికి గురై గృహిణి మృతి చెందింది. మహిముద్, నస్రీన్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలను స్నానం చేయించేందుకు విద్యుత్ వాటర్ హీటర్ తో నీటిని వేడి చేస్తున్న క్రమంలో షేక్ నస్రీన్ (30) విద్యుతాఘాతానికి గురై అపస్మారక స్థితి లోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు నస్రీన్ ను హుటాహుటిన కోదాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా భర్త మహిముద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. 

Post a Comment

0 Comments