Ad Code

బీఎస్ఎన్ఎల్ చౌకైన రీచార్జి ప్లాన్లు !


బీఎస్ఎన్ఎల్ రూ.98 ప్లాన్ 18 రోజుల వాలిడిటీని ఇస్తుంది. దీనిలో 2జీబీ డేటాను కూడా పొందుతారు. 18 రోజుల్లో మొత్తం 36జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత 40Kbps ఇంటర్నెట్ స్పీడ్‌ను కూడా పొందవచ్చు. అలాగే రూ. 58 ప్లాన్‌ విషయానికి వస్తే. బీఎస్‌ఎన్‌ఎల్‌ జాబితాలో మీరు రూ.58 చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను పొందవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ తో మీకు 7 రోజుల వాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. దీనిలో మీరు రోజువారీ డేటా పరిమితిని పూర్తి చేసిన తర్వాత 40kbps వేగం పొందుతారు. కానీ ఈ ప్లాన్‌ తీసుకోవాలంటే కనీసం 28 రోజుల ప్లాన్‌ కలిగి ఉండటం ముఖ్యం. అలాగే రూ. 94 ప్లాన్ మీకు మరింత ఇంటర్నెట్ డేటా అవసరమైతే మీరు రూ. 94 ప్లాన్‌ తీసుకోవచ్చు. ఇందులో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే దాని చెల్లుబాటు. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు 30 రోజుల పూర్తి వ్యాలిడిటీని ఇస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌ లో మీరు రోజుకు 3జీబీ డేటా పొందుతారు. అంటే మీరు 30 రోజుల్లో మొత్తం 90జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జ్ ప్లాన్‌ లో కస్టమర్‌ లకు కాలింగ్‌ కోసం 200 నిమిషాలు అందుకుంటారు. రూ.87 ప్లాన్‌ విషయానికి వస్తే.. రీఛార్జ్ ప్లాన్‌లో కంపెనీ కస్టమర్‌లు 14 రోజుల వాలిడిటీని పొందవచ్చు. మీకు రోజుకు 1జీబీ హై స్పీడ్ డేటాను అందిస్తుంది. మీరు ప్లాన్‌లో మొత్తం 14జీబీ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ లో కంపెనీ వినియోగదారులకు లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. మీరు హార్డీ మొబైల్ గేమ్ ల సేవను కూడా పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu