భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ను బుధవారం అలీఘర్ పోలీసులు నిర్బంధించారు. రైతు నేతల సమావేశంలో పాల్గొనేందుకు గ్రేటర్ నొయిడాకు వెళుతున్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాకేష్ తికాయత్ తో పాటు ఆయన సహచరులు యమునా ఎక్స్ ప్రెస్ వేపై వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారని, అనంతరం బస్సులో తప్పల్ పోలీస్ స్టేషన్కు తరలించారని అన్నారు. రాకేష్ తికాయత్ ను అరెస్ట్ చేయలేదని, ఆయనను నిర్బంధించామని అలీఘర్ పోలీస్ అధికారిక ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. నొయిడాకు వెళ్లకుండా రైతులను వారి ఇళ్లలో పోలీసులు నిర్బంధిస్తున్నారని తికాయత్ ఆరోపించారు. ''మమ్మల్ని ఎంతకాలం నిర్బంధిస్తారు. మీరు మమ్మల్ని లాక్కెళితే మీరు ఎవరితో మాట్లాడతారు'' అని ఆయన ప్రశ్నించారు. అధికారుల తీరు ఇలాగే కొనసాగితే రైతుల ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముజఫర్ నగర్ లోని సిసౌలి గ్రామంలోని కిసాన్ భవన్ లో బికెయు అధ్యక్షుడు నరేష్ తికాయత్ నేతృత్వంలో మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భూపరిహారం, ఇతర డిమాండ్ల సాధన కోసం నొయిడాలో ఆందోళన చేపడుతున్న రైతులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
రాకేష్ తికాయత్ ను నిర్బంధించిన అలీఘర్ పోలీసులు !
الأربعاء، 4 ديسمبر 2024
national ఆయనను నిర్బంధించామని గ్రేటర్ నొయిడాకు వెళుతున్న తికాయత్ ను అరెస్ట్ చేయలేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ను నిర్బంధించిన అలీఘర్ పోలీసులు
ليست هناك تعليقات:
إرسال تعليق