మహారాష్ట్రలో జిల్లా పరిషత్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న సురేష్ సంగ్రామే అనే వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్ కోసం నాథు గైక్వాడ్ అనే మరో వ్యక్తి తో బైక్ పై ప్రయాణిస్తుండగా జేబులో ఫోన్ పేలింది. నెల రోజుల క్రితం తీసుకున్న కొత్త సి ఎంఎఫ్ 1 ఫోన్ పేలడంతో బైక్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో వెనుక ఉన్న గైక్వాడ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. సంగ్రామే మాత్రం ఘటనలో శరీరం కాలడంతో పాటు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో ఫోన్ బ్లాస్ట్ కావడానికి దారి తీసిన కారణాలు తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చెప్పారు. అయితే, కొత్త ఫోన్ లలో ఇటివంటి సంఘటన జరగడం చాలా అరుదుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ నిపుణుల ప్రకారం, బ్యాటరీలోని మాల్ ఫంక్షన్ కారణంగా ఇటివంటి ఘటనకు దారి తీసి ఉండవచ్చని, ఇటివంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు. సరైన ఛార్జర్ వాడకం పోవడం, అధిక వేడిమికి చేరువలో ఫోన్ ను ఉంచడం, ఇతర కారణాలు ఫోన్ బ్యాటరీని ప్రభావితం చేస్తాయి. అటువంటి సమయాల్లో ఫోన్ పేలుడుకు దారి తీసే అవకాశం ఉండవచ్చని చెబుతున్నారు.
సి ఎంఎఫ్ 1 ఫోన్ పేలి వ్యక్తి మృతి !
الاثنين، 9 ديسمبر 2024
Criem maharashtra nothing science Smartphone technology బైక్ పై ప్రయాణిస్తుండగా జేబులో ఫోన్ పేలి సి ఎంఎఫ్ 1 ఫోన్ పేలి వ్యక్తి మృతి
ليست هناك تعليقات:
إرسال تعليق