మనీలాండరింగ్ కేసులో ప్రైవేట్ వాలెట్‌ల నుండి రూ.1.36 కోట్ల విలువైన క్రిప్టోకరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది. రూ. 47 లక్షల వరకు నగదు కూడా ఉన్నట్లు బుధవారం సంబంధిత అధికారులు తెలిపారు. రూ.640 కోట్ల అక్రమ ఆదాయానికి సంబంధించిన సైబర్ మోసం కేసు విచారణలో భాగంగా నగదుతో పాటు వివిధ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చెక్‌బుక్‌లు, ఎటిఎం కార్డులు, పాన్ కార్డ్‌లను కూడా స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ),2022 నిబంధనల ప్రకారం.. నవంబర్ 28 నుండి నవంబర్ 30 వరకు ఢిల్లీ, గురుగ్రామ్, జోధ్‌పూర్, జుంజును, హైదరాబాద్, పూణె మరియు కోల్‌కతాల్లోని 13 ప్రాంతాలలో ఈడి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత ఈ రికవరీ జరిగిందని అన్నారు. ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన రెండు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టుల (ఎఫ్‌ఐఆర్) ఆధారంగా ఈడి దర్యాప్తు ప్రారంభించింది.
0 Comments