డిసెంబర్ 12న ఎక్స్200 సిరీస్ ఫోన్‌ల విడుదల !

الخميس، 12 ديسمبر 2024

12GB + 256GB 16GB + 512GB business science smart phones technology vivo డిసెంబర్ 12న ఎక్స్200 సిరీస్ ఫోన్‌ల విడుదల

t f B! P L


డిసెంబర్ 12న దేశీయ మార్కెట్లో వివో రెండు కొత్త ఫోన్‌లను అందించబోతోంది. ఫోన్‌ల లాంచ్‌కు ముందు టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఈ ఫోన్‌ల ధరలను లీక్ చేశారు. పేర్కొన్న ధరల ప్రకారం ఎక్స్200 సిరీస్ ఫోన్‌లు ఎక్స్100 సిరీస్ కంటే ఖరీదైనవి. టిప్‌స్టర్ ప్రకారం, వివో ఎక్స్200 రెండు వేరియంట్‌లలో వస్తుంది. 12GB + 256GB, 16GB + 512GB. ఫోన్ 12GB RAM వేరియంట్ ధర రూ.65,999, 16GB RAM వేరియంట్ ధర రూ.71,999 ఉండనుందని లీకుల ద్వారా తెలుస్తోంది. డిసెంబర్ 19 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియాలో వారి సేల్ ప్రారంభమవుతుంది. కంపెనీకి చెందిన ఈ ఫోన్‌లు 200 మెగాపిక్సెల్‌ల వరకు టెలిఫోటో సెన్సార్‌తో వస్తాయి. ఎక్స్200లో 6.67-అంగుళాల డిస్‌ప్లేను, X200 ప్రోలో 6.78-అంగుళాల డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ప్రాసెసర్‌గా మీరు X200లో డైమెన్సిటీ 9400, ప్రో వేరియంట్‌లో 9300 చిప్‌సెట్‌ను పొందుతారు. ఫోటోగ్రఫీ కోసం మూడు వెనుక కెమెరాలు X200లో అందుబాటులో ఉంటాయి. వీటిలో 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్‌తో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి.


Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ