ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ (69) మృతిచెందారు. ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బిబేక్ శుక్రవారం హఠాత్తుగా మరణించారు. దెబ్రాయ్ మృతికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 'డాక్టర్ దెబ్రాయ్ నాకు చాలాకాలంగా తెలుసు. ఆర్థికశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఇలా ఎన్నో విభిన్నరంగాల్లో ఆయనకు ఎంతో ప్రావీణ్యం ఉంది. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి అతీతం. ప్రాచీన గ్రంథాలపై పనిచేయడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. యువత కోసం వాటిని అందుబాటులోకి తెచ్చారు. ఆయన మృతి నన్ను ఎంతో బాధించింది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి' అని మోడీ పేర్కొన్నారు.
ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ హఠాన్మరణం !
الجمعة، 1 نوفمبر 2024
national ప్రధాని ఆర్థిక సలహామండలికి అధ్యక్షుడు ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి ప్రముఖ ఆర్థికవేత్త బిబేక్ దెబ్రాయ్ హఠాన్మరణం
ليست هناك تعليقات:
إرسال تعليق