సినీ నటుడు శ్రీతేజ్ పై హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును చేపట్టారు. శ్రీతేజ్ పై గతంలోనూ ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఓ మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి ఆ మహిళ భర్త గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు శ్రీతేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Post a Comment

أحدث أقدم