తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమిళనాడులోని శంకరన్ కోవిల్‌కు చెందిన వేణులింగం అనే యువకుడు వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్న స్టీల్ హుండీలో నగదును తస్కరించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా హుండీ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయింది. విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అదే రోజు సాయంత్రం 6 గంటలకు పట్టుకుని, అతడి వద్ద నుంచి చోరీ చేసిన రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ : నిందితుడి అరెస్టు !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق