సత్యవతీ చౌహాన్ అలియాస్ మంగ్లీ సంగీత నాటక అకాడమీ నుంచి 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' యువ పురస్కారానికి ఎంపికైంది. ఆమె న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అతిరథ మహారధుల సమక్షంలో అందుకున్నారు. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ తో స్టార్ సింగర్ అయింది. ఇక మంగ్లీకి సొంతగా యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో రకరకాల పాటలను పాడుతూ క్రేజ్ సొంతం చేసుకుంది.. గత కొన్నేళ్లుగా మంగ్లీ టాలీవుడ్ లో సత్తా చాటుతుంది. జార్జి రెడ్డి మూవీలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్ మంగ్లీకి మంచి పేరు తెచ్చింది. అనంతరం అల వైకుంఠపురంలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు అనేక సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమె తో పాడించిన పాటలు జనాలను ఆకట్టుకుంటున్నాయి.
'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' యువ పురస్కారాన్ని అందుకున్న మంగ్లీ !
الأحد، 24 نوفمبر 2024
'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' యువ పురస్కారాన్ని అందుకున్న మంగ్లీ Andhra Pradesh cinema national telangana సంగీత నాటక అకాడమీ నుంచి
ليست هناك تعليقات:
إرسال تعليق