జార్ఖండ్‌ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ బీజేపీ : రాజ్‌నాథ్‌సింగ్


జార్ఖండ్‌లోని హతియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొని ప్రసంగిస్తూ జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ మాత్రం.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని వ్యాఖ్యానించారు. జార్ఖండ్‌లో బీజేపీని గెలిపిస్తే సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తామన్నారు. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుందని విమర్శించారు. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా హేమంత్ సర్కార్ పనిచేస్తోందన్నారు. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నానన్నారు. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది? అని ప్రశ్నించారు. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్‌ను నిలబెడతామని హామీ ఇచ్చారు. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

Post a Comment

0 Comments