Ad Code

దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంపు: మంత్రి ఆనం రామనారాయణ


ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనాలను పెంచుతున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసే వారి వేతనాలు పెంచుతున్నట్లు చెప్పారు. అర్చకులకు రూ.15వేల కనీస వేతనం ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో 3,203 మంది అర్చకులకు లబ్ధిచేకూరనుందని మంత్రి అన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10కోట్ల మేర అదనపు భారం పడనుందని చెప్పారు. కొంత మొత్తం సీజీఎఫ్‌ నిధుల నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వేద పండితులు, వేద విద్యార్థులకు నిరుద్యోగ భృతి ద్వారా లబ్ధి కలుగుతుందని మంత్రి వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu