పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నా : ప్రధాని


హారాష్ట్రలో విజయం తరువాత బీజేపీ ముఖ్యుల్లో జోష్ కనిపిస్తోంది. నేటి నుంచి ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. శీతాకాల సమావేశాలు కావడంతో వాతావరణం చల్లగా ఉంటుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. విపక్షాలను ప్రధాని మోడీ టార్గెట్ చేసారు. కొద్దిమంది వ్యక్తులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ప్రస్తావించారు. ఆ వ్యక్తులు తమ బాధ్యతలను అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్‌లో సానుకూల చర్చలు జరగాలని కోరుకుంటున్నట్లు ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని ప్రధాని మోడీ గుర్తు చేసారు. పార్లమెంటులో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. సమావేశాల్లో సాను కూల చర్చలు జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. పార్లమెంటులో వీలైనంత ఎక్కువమంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సభలో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు. కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో చర్చలు సభా గౌరవ మర్యాదలకు అనుగుణంగా జరగాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వ్యాఖ్యానించారు. సభా సంప్రదాయాలు, వ్యవహారాలను స్ఫూర్తిగా తీసుకుని సభల్లో మంచి చర్చలు జరపాలని ఎంపీలకు ఓం బిర్లా సూచించారు. పార్లమెంటులో ఏమేం అంశాలు చర్చించాలన్నదానిపై కాంగ్రెస్ ఎంపీలకు నిర్దేశించింది. ఈ సమావేశాల్లో 16 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆదానీ వ్యవహారం పై జేపీసీని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే సభ వాయిదా పడింది.

Post a Comment

0 Comments