తెలంగాణలోని సంగారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయాలు బంద్ చెయ్యాలని ఉంది అన్నారని, బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదని, అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కోవాలని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదా అని ప్రశ్నించారు. ''మీ  తండ్రి పది నెలలుగా ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. ఏమైనా నష్టం జరిగిందా'' అని నిలదీశారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదని.. ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసమని విమర్శలు చేశారు. ఆయనకు కాంగ్రెస్ పది నెలల పాలనే విసుగొస్తే బీఆర్ఎస్ పాలనను ఎలా భరించారని నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని అన్నారు. కేటీఆర్‌కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఆరోపించారు. ఫామ్‌హౌస్ కేసులో పాలేవో, నీళ్లేవో తెలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందేనని అన్నారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారని, తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని నిలదీశారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు.

Post a Comment

أحدث أقدم