కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన మేనల్లుడు రేహాన్ వాద్రా కళాకారుల వద్దకు వెళ్లి వారితో కలిసి దీపావళి వేడుకలు నిర్వహించుకున్నారు. వారితో పాటుగా ప్రమిదలు, కుండలు తయారు చేశారు. అంతే కాకుండా వారితో కలిసి ఓ నివాసానికి రంగులు వేసి వారి వద్ద పెయింటింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ''భారతదేశాన్ని ప్రకాశవంతం చేసే వారితో దీపావళి'' అంటూ రాసుకొచ్చారు. ''ఈ కళాకారులు తయారు చేసే మట్టి ప్రమిదలు ఎప్పటికైనా ప్రపంచంలోని విలువైన సెరామిక్‌తో చేసిన వస్తువులతో పోటీ పడొచ్చు'' అని రాహుల్‌ తన మేనల్లుడు రేహాన్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను వివరించారు. ఈ కార్మికులు ప్రతి ఒక్కరి దీపావళిని సంతోషకరమైనదిగా చేస్తారని, ఈ పండగ వీరందరి జీవితాల్లో శ్రేయస్సు, పురోగతి, అభివృద్ధిని తీసుకొస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

أحدث أقدم