ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా శింగనమల మండలం లోలూరులోని కర్పూరం పరిశ్రమ నిర్వహణలో భాగంగా పరిశ్రమలోని రియాక్టర్లు శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ఆరుగురు కూలీలు స్పృహ తప్పి పడిపోయారు. స్పందించిన తోటి సిబ్బంది వెంటనే రియాక్టర్ నుంచి బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించి, అనంతపురంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కూలీలకు ఆక్సిజన్ అమర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే, వారి పరిస్థితిపై ఇప్పుడే ఎలాంటి నిర్ధరణకు రాలేమని వైద్యులు చెబుతున్నారు.
إرسال تعليق