తెలంగాణలో నూతన విద్యుత్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ నిపుణులు, ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. '' మే నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తాం. రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నాం. 2028-29 నాటికి విద్యుత్ డిమాండ్ 22,488 మెగావాట్లకు చేరొచ్చు. 2034-35 నాటికి డిమాండ్ 31,809 మెగావాట్లకు చేరే అకాశం ఉంది. మార్పులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెడుతున్నాం'' అని వివరించారు.
త్వరలో నూతన విద్యుత్ పాలసీ: డిప్యూటీ సీఎం భట్టి
الأحد، 3 نوفمبر 2024
telangana డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలో నూతన విద్యుత్ పాలసీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో
ليست هناك تعليقات:
إرسال تعليق